కేసీఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదు: చాడ | kcr has to pay for power outrages, says chada venkat reddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదు: చాడ

Sep 29 2014 11:55 AM | Updated on Aug 15 2018 9:22 PM

కేసీఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదు: చాడ - Sakshi

కేసీఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదు: చాడ

రైతుల నష్టాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు.

తెలంగాణలో విద్యుత్ సమస్య చాలా తీవ్రంగా ఉందని, రైతుల నష్టాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూల్యం చెల్లించుకోక తప్పదని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. నగరాల్లో కూడా నాలుగు నుంచి ఆరు గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆయన అన్నారు.

సాధారణంగా ఇళ్లలో జరుపుకోవాల్సిన పండగలను అధికారికంగా నిర్వహిస్తూ కేసీఆర్ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ఆయన విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ కూటములు కుంభకోణాల్లో కూరుకుపోయాయని, దీనిపై అక్టోబర్ 16వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement