
సాక్షి, హైదరాబాద్: ‘సరుకు రవాణా చేసే కార్గో బస్సులపై సీఎం కేసీఆర్ ఫొటో పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ యత్నాలను కేసీఆర్ తప్పుపట్టారు’అని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఆర్టీసీ బస్సులను సరుకు రవాణాకు వాడటం వల్ల ప్రజలకు సేవలు అందించడం, ఆర్టీసీ లాభాల్లో పయనించడం తన లక్ష్యం అని సీఎం అన్నారు. బస్సులపై ఫొటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని కేసీఆర్ స్పష్టం చేశారు’ అని సీఎంవో పేర్కొంది.