గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి | Karimnagar Based RTC Driver Dies Of A Heart Attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

Oct 30 2019 8:38 PM | Updated on Oct 30 2019 8:41 PM

Karimnagar Based RTC Driver Dies Of A Heart Attack - Sakshi

సాక్షి, హైదరాబాద్: సరూర్ నగర్‌లో బుధవారం జరిగిన సకల జనుల సమావేశానికి హాజరయిన ఆర్టీసీ డ్రైవర్ అనూహ్యంగా గుండెపోటుతో మరణించాడు. మృతుడు కరీంనగర్-2 డిపోకు చెందిన నంగునూరి బాబు అని, జిల్లాలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించేవాడని ప్రాథమికంగా గుర్తించారు. ఆర్టీసీ సమ్మెపై ప్రతిపక్ష నేతలు, కార్మిక సంఘాల నాయకులు చేస్తున్న ప్రసంగాలు వింటుండగా.. హఠాత్తుగా బాబుకు గుండెపోటు రావడంతో.. తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాబు కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర కలత చెందిన బాబు గుండె పోటుకు గురై హఠాన్మరణం పొందాడని తోటి కార్మికులు పేర్కొన్నారు. డ్రైవర్ బాబు మృతికి సంతాపంగా రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్‌కు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement