
ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన మంత్రి వర్గంలో మాలలకు చోటు కల్పించకపోవడం దారుణమని, ఈ నిర్ణయంతో ఆయన మాలల మనోభావాలను దెబ్బతీశారని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహనరావు నియమితులు కానున్నారు. ఈ నెల 8న ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కంభంపాటి నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సోమవారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎన్‌టీఆర్ భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కంభంపాటిని నియమిస్తున్నట్లు చెప్పారు.