కల్వకుర్తి ఫలితానికి బ్రేక్ | kalwakurthy results break | Sakshi
Sakshi News home page

కల్వకుర్తి ఫలితానికి బ్రేక్

May 17 2014 3:38 AM | Updated on Sep 2 2017 7:26 AM

ఆ కౌంటింగ్ హాల్ వద్ద ఉదయం 7 గంటల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పడిగాపులు కాశారు.. ‘మా పార్టీ అభ్యర్థి గెలుపు సాధిస్తారంటే..

పాలమూరు, న్యూస్‌లైన్: ఆ కౌంటింగ్ హాల్ వద్ద ఉదయం 7 గంటల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పడిగాపులు కాశారు.. ‘మా పార్టీ అభ్యర్థి గెలుపు సాధిస్తారంటే.. కాదు మా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అవుతారంటూ ’ పోటా పోటీ గా నినాదాలు చేస్తూ ఉత్కంఠతో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూశారు. చివరి రౌండ్ రానే వచ్చింది.. ఆ రౌండ్ పూర్తయితే.. 633 ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం బయటపడేది..
 
 కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని 119 నంబర్ పోలింగ్ బూత్‌కు చెంది న ఈవీఎం సాంకేతికలోపం కారణంగా పనిచేయలేదు. దీంతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయిం ది. నిపుణులు వచ్చి బాగుచేస్తే ఫలితాలు వెల్లడిస్తారేమోనని.. అం తా రాత్రి 9.30 గంటల వరకు ఎదురు చూపులు చూశారు. కౌటింగ్ కేం ద్రం నిర్వహణాధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అవకాశం లేదని చెప్పడంతో ఉసూరంటూ అన్ని పార్టీలకు చెందిన వారు ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.

 కల్వకుర్తి 1వ రౌండ్ నుంచి 28వ రౌండ్ వర కు నువ్వా.. నేటా అన్న ట్లు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి మధ్య తీవ్రపోటీ ఏర్పడింది. కొన్ని రౌండ్లలో ఒకరు ముందంజలో నిలిస్తే.. అతర్వాత రౌండ్లలో మరొకరు మరొకరు ఆధిక్యతను ప్రదర్శించారు. ఆతర్వాత 32వ రౌండ్ వరకు ఆచారి ఆధిక్యతను ప్రదర్శించగా.. ఆతర్వాతి రౌండ్లలో వంశీచందర్ ఓటుశాతాన్ని పెంచుతూ వచ్చారు. చివరిరౌండ్ వచ్చేటప్పటికి 32 ఓట్ల ఆధిక్యతతో వంశీచందర్‌కు 42229 ఓట్లు నమోదయ్యాయి.
 
 ఆచారికి 42,197 ఓట్లు పోలయ్యాయి. చివరి రౌండ్ పూర్తయితేగాని వీరిద్దరిలో విజయం ఎవరిని వరించేదో తేటతెల్లమయ్యేది. చివరన ఈవీఎం పనిచేయకపోవడంతో ఫలితాలు నిలిచిపోయి. వీరితోపాటు కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి పోటీ చేసిన వారిలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్‌కు 29,687 ఓట్లు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎడ్మకిష్టారెడ్డికి 13,734 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి కె.నారాయణరెడ్డికి 23,999 ఓట్లు పోలయ్యాయి. బీఎస్పీ అభ్యర్థి కె.జంగయ్యకు 1892, ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి వి.హుస్సేన్‌కు 916, స్వతంత్ర అభ్యర్థులు బాలాజీ సింగ్ ఠాకూర్‌కు 3,212,  దోనాల క్రిష్ణారెడ్డికి 687, ఎత్తం శ్రీనివాస్‌కు 651 ఓట్లు దక్కాయి. ఇక పోతే నోటాకింద 1132 ఓట్లు పోలైనట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
 
ఈసీ ఆదేశిస్తే..!
ప్రెసెంట్ ఎక్సీడెడ్ సాంకేతిక లోపం కారణంగా.. ఈ వీఎం మొరాయించింది. కల్వకుర్తి నియోజకవర్గం జూపల్లి గ్రామానికి చెందిన 119 నంబర్ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒక ఈవీఎం మెషిన్ మొరాయించడంతో కౌంటింగ్ నిలిచిపోయింది.

ఈ పోలింగ్ బూత్ పరిధిలో 633 ఓట్లు పోలయ్యాయి. ఈ మొత్తాన్ని లెక్కించాల్సి ఉండగా.. సాంకేతిక లోపం ఏర్పడటంతో తాత్కాలికంగా నిలపాల్సి వచ్చింది. ఈ సాంకేతిక లోపం నిపుణుల ద్వారా సరిదిద్దగలిగితే కౌంటింగ్ పూర్తిచేసి ఫలితాలు ప్రకటిస్తాం, ఒక వేళ ఈవీఎం పనిచేయకుంటే ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే.. ఆమేరకు రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.              
 - కలెక్టర్ ఎం.గిరిజాశంకర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement