‘కాళేశ్వరం’తో సస్యశ్యామలం చేస్తాం: పోచారం శ్రీనివాస్‌రెడ్డి

Kaleshwaram Project Is Given Development To The Banswada - Sakshi

గట్టుమీది గ్రామాల ప్రజలకు పోచారం హామీ 

మంత్రికి గ్రామాల్లో ఘనస్వాగతం 

సాక్షి, బాన్సువాడరూరల్‌: టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తే గట్టుమీది గ్రామాలకు కాళేశ్వరం నీళ్లు తెచ్చి బీడుభూములను సస్యశ్యామలం చేస్తామని బాన్సువాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన బాన్సువాడ మండలంలోని బోర్లం, బోర్లంక్యాంపు, తండా, జక్కల్‌దాని తండా, పులిగుండు తండా, హన్మాజీపేట్, కాద్లాపూర్‌ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మంత్రికి ప్రజలు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ తె లంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు ఐక్యరాజ్య సమితి మన్ననలు పొందాయన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక పోతు న్నాడని, అందుకే కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే చర్యలకు పూనుకున్నాడన్నారు. భవిష్యత్తులో రాష్ట్రం మరింత అ భివృద్ధి సాధించాలంటే తిరిగి కేసీఆర్‌ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పో చారం భాస్కర్‌రెడ్డి, బద్యానాయక్, అంజిరెడ్డి, మోహన్‌నాయక్, సంగ్రాంనాయక్, ఎజాస్, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింలు, బాల్‌సింగ్, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top