కడక్‌నాథ్‌కోడి @1,500  | Sakshi
Sakshi News home page

కడక్‌నాథ్‌కోడి @1,500 

Published Mon, Sep 16 2019 2:56 AM

Kadaknath breed Chicken Prices range from Rs 1200 to Rs 1500 - Sakshi

సోన్‌ (నిర్మల్‌): కడక్‌నాథ్‌ కోడి.. ప్రస్తుతం నిర్మల్‌ చుట్టుపక్కల అత్యధికంగా వినిపిస్తున్న పేరు. దీనికి కారణం కూడా ఉందండోయ్‌.. అదే ఈ కోడి రేటు! అవును .. ప్రస్తుతం మార్కెట్‌లో దీని ధర రూ.1,200 నుంచి రూ.1,500 వరకు పలుకుతోంది. ఇందులో పుంజుకయితే ఇంకాస్త రేటు ఎక్కువే. ఈ కోడి పూర్తిగా నలుపు రంగులో ఉండడం స్పెషల్‌. గతంలో ఎవరికీ తెలియని ఈ కోళ్లను ప్రస్తుతం నిర్మల్‌ ప్రాంతాల్లో అధికంగా విక్రయిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌ నుంచి ఎక్కువగా ఇవి నిర్మల్‌ జిల్లాకు దిగుమతవుతున్నాయి. కాళ్లు, కీళ్ల నొప్పులు, కిడ్నీల్లో రాళ్లు, ఆస్తమా, బీపీ, షుగర్‌ ఉన్నవాళ్లు ఈ కోడిని తింటే రోగాలు నయమవుతాయని ప్రచారం ఈమధ్య జోరందుకుంది. దీంతో ఈ కోళ్లకు డిమాండ్‌ ఏర్పడింది. సాధారణంగా గ్రామాల్లో లభించే దేశీకోళ్లు ఒక్కోటి రూ.400 వరకు ధర పలుకుతుండగా, బాయిలర్‌ చికెన్‌ కిలో రూ.180, మటన్‌ రూ.500 వరకు అమ్ముతున్నారు. ఈ కడక్‌నాథ్‌ కోళ్లు మాత్రం కిలో నుంచి కిలోన్నర బరువు ఉన్నప్పటికీ ధర మాత్రం రూ.1,200 నుంచి రూ. 1,500 వరకు పలుకుతుండటం గమనార్హం.   

Advertisement
Advertisement