‘వాస్తవాలకతీతంగా ఎగ్జిట్‌ ఫలితాలు’

 K Narayana said there was no exit poll results to reflect the facts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వాస్తవాలను ప్రతిబింబించేలా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు లేవని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుంటే, ఏ అంశాల ఆధారంగా బీజేపీకి 300 సీట్లు దాటుతాయని చెబుతున్నారో అర్థం కావడం లేదన్నా రు. మంగళవారం మఖ్దూంభవన్‌లో ఆయన విలేకరు లతో మాట్లాడారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకూడదని, ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో ధన ప్రవాహం ఆగాలన్నా, అధికార పార్టీలోకి ఫిరాయింపులు నిలిచిపోవాలన్నా దామాషా పద్ధతి ఎన్నికల విధానాన్ని అనుసరిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం లభించే అవకాశాలు ఉంటాయన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top