జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్‌కు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ నివాళులర్పించారు.
సాక్షి, హైదరాబాద్ : తన జీవితమంతా ప్రజల పక్షం వహించి, ప్రజల ప్రయోజనాల కోసమే నిలబడి, దేశంలో సామ్యవాద సమాజ స్వప్నాన్ని సాకారం చేయాలని గాఢంగా కోరుకున్న జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్‌కు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ నివాళులర్పించారు.
కేరళ హైకోర్టు న్యాయవాదిగా పనిచేసిన ఆయన, 1957లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో కేరళలో ఏర్పడిన మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారన్నారు. భూసంస్కరణల అమలుకు, ఇంకా అనేక ప్రజా అనుకూల చర్యల అమలుకు కృషి చేశారన్నారు.
మొదట హైకోర్టు న్యాయమూర్తిగా, ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రాజ్యాంగాన్ని, చట్టాలను ప్రజలకు అనుకూలంగా వ్యాఖ్యానించి, వారికి అనుకూలంగా తీర్పునిచ్చేందుకు కృషిచేశారని పేర్కొన్నారు.