జూరాలకు పెరుగుతున్న వరద ఉ‍ధృతి..

Jurala Reservoir Gets Huge Flood Water From Krishna Basin Water - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్‌కు నీటి ప్రవాహాలు పెరుగుతున్నాయి.  ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం డ్యామ్‌ల గేట్లను ఎత్తి నదిలోకి నీటిని వదిలిపెడుతుండటంతో జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తోంది. జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి దిగవకు నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.విన్‌ఫ్లో58 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ ఫ్లో 52వేల 750 క్యూసెక్కులు ఉంది. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9,657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9,214 టీఎంసీలు ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.44 మీటర్లుగా ఉంది. 

ఎగువ జురాల జల విద్యుత్‌ 3 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. దిగువన ఉన్న జల విద్యుత్ కేంద్రంలో మూడు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే భీమా, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌ ఎత్తిపోతల పథకాలను నీటి పంపింగ్‌ కొనసాగుతున్నట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top