ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత అంశాలను సమన్వయం చేసుకోవడానికి ఏడుగురు మంత్రులకు అధినాయకత్వం బాధ్యతలు అప్పగించింది.
తెలుగు రాష్ట్రాలకు బీజేపీ సమన్వయకర్తలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత అంశాలను సమన్వయం చేసుకోవడానికి ఏడుగురు మంత్రులకు అధినాయకత్వం బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా (ఆంధ్రప్రదేశ్), హన్స్‌రాజ్ అహిర్ (తెలంగాణ), నిర్మలా సీతారామన్ (పశ్చిమ బెంగాల్), పీయూశ్ గోయల్ (తమిళనాడు, పుదుచ్ఛేరి), రాజీవ్ ప్రతాప్ రూడీ (కేరళ), ధర్మేంద్ర ప్రధాన్ (అస్సాం), మహేశ్ శర్మ (ఒడిశా)లకు పార్టీని సమన్వయం చేసుకోవడంపై ప్రత్యేకంగా దృష్టిని సారించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించారు.