
(ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: యూఎస్ కాన్సులేట్ నూతన కాన్సుల్ జనరల్‌గా జోయల్ ఫ్రీమన్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం నగరంలోని కాన్సులేట్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఢాకాలో యూఎస్ ఎంబసీలో ఆయన డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా, వాషింగ్టన్ డీసీలో బ్యూరో ఆఫ్ ఇంటలిజెన్స్ అండ్ రీసెర్చ్‌లో సీనియర్ లైజన్ అధికారిగా పనిచేశారు. పలుదేశాల్లో అమెరికా తరఫున వివిధ హోదాల్లో పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జోయల్ మాట్లాడారు. హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో కాన్సుల్ జనరల్‌గా పనిచేసిన కేథరిన్ హడ్డా ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.