
భూపాలపల్లి రూరల్ : పల్లె ప్రగతి పనుల చివరి రోజు సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదివారం పలు గ్రామాలను సందర్శించారు. ఆముదాలపల్లికి బుల్లెట్ వాహనంపై వెళ్లారు. మార్గమధ్యలో పత్తి చేలల్లో కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూలీలతో కలసి పత్తి ఏరుతూ వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి పత్తి ఏరుతున్న ఇంటర్ విద్యార్థిని ఝాన్సీతో కాసేపు మాట్లాడారు. వ్యవసాయ పనుల్లో కుటుంబానికి ఆసరాగా నిలిచిన ఝాన్సీని అభినందించిన కలెక్టర్, బాగా చదువుకోవాలని అన్నారు.