కాపలాకుక్కలా ఉంటానని కారుకూతలా?: జానారెడ్డి | Jana reddy takes on KCR | Sakshi
Sakshi News home page

కాపలాకుక్కలా ఉంటానని కారుకూతలా?: జానారెడ్డి

Apr 25 2014 4:57 AM | Updated on Oct 22 2018 9:16 PM

కాపలాకుక్కలా ఉంటానని కారుకూతలా?: జానారెడ్డి - Sakshi

కాపలాకుక్కలా ఉంటానని కారుకూతలా?: జానారెడ్డి

తెలంగాణ ఇచ్చాక కాపలాకుక్కలా ఉంటానని అన్న కేసీఆర్ ఇప్పుడు మాటమార్చి రాజ్యాన్ని ఏలుతానని అంటున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి విమర్శించారు.

గుర్రంపోడు, న్యూస్‌లైన్: తెలంగాణ ఇచ్చాక కాపలాకుక్కలా ఉంటానని అన్న కేసీఆర్ ఇప్పుడు మాటమార్చి రాజ్యాన్ని ఏలుతానని అంటున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలో గురువారం పలు ప్రచారసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ 1992 లో అసెంబ్లీలో తాను తెలంగాణ ఇవ్వకపోతే మరో ఉద్య మం వస్తుందని హెచ్చరించానని తెలిపారు. తెలంగాణ కోసం 1998లో తాను, 2000లో 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియాకు వినతిపత్రాలు సమర్పిం చామని తెలిపారు. పార్లమెంట్‌లో సొంత పార్టీ నుంచి ప్రతిఘటన ఎదురైనా సాహసోపేతంగా సోనియా తెలంగాణ  ఇచ్చార నీ, ఆమె రుణం తీర్చుకోవాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement