మమ్నల్ని అడగకుండానే నియమిస్తారా? | Jana Reddy makes Objection to appoint of congress members | Sakshi
Sakshi News home page

మమ్నల్ని అడగకుండానే నియమిస్తారా?

Nov 13 2014 2:13 AM | Updated on Sep 19 2019 8:44 PM

మమ్నల్ని అడగకుండానే నియమిస్తారా? - Sakshi

మమ్నల్ని అడగకుండానే నియమిస్తారా?

తమను సంప్రదించకుండానే తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ‘రూల్స్’ కమిటీలో ఎలా నియమించారని, ఈ విషయం లో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని సీఎల్పీనేత కె.జానారెడ్డి ఆక్షేపించారు.

రూల్స్ కమిటీలో కాంగ్రెస్ సభ్యుల నియామకంపై జానా అభ్యంతరం
స్పీకర్ మధుసూదనాచారికి లేఖ!

 
 సాక్షి, హైదరాబాద్: తమను సంప్రదించకుండానే తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ‘రూల్స్’ కమిటీలో ఎలా నియమించారని, ఈ విషయం లో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని సీఎల్పీనేత కె.జానారెడ్డి ఆక్షేపించారు. ఈ మేరకు బుధవారం ఆయన అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. అయితే ఈ లేఖను అధికారికంగా బయట పెట్టని జానా, అందులో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. మంగళవారం స్పీకర్ రూల్స్ కమిటీని ప్రకటించారు. ఆ కమిటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కిష్టారెడ్డి ఉన్నారు. వీరిని కమిటీలోకి తీసుకునే ముందు సీఎల్పీ నేతను సంప్రదించలేదని తెలుస్తోంది. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన భట్టి విక్రమార్కను పార్టీ తరఫున రూల్స్ కమిటీలో ఉంచాలన్న ఆలోచనలో సీఎల్పీ ఉన్న ట్లు సమాచారం. ఈ కారణంగానే జానా స్పీకర్‌కు లేఖ రాసినట్లు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement