లిఫ్ట్‌లో ఇరుకున్న మంత్రి | Jagadish Reddy Stuck In Lift At Kannepalli Pump House | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌లో ఇరుకున్న మంత్రి

Jun 21 2019 8:53 PM | Updated on Jun 21 2019 8:54 PM

Jagadish Reddy Stuck In Lift At Kannepalli Pump House - Sakshi

భూపాలపల్లి : తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌజ్‌ పరిశీలనకు వచ్చిన జగదీశ్‌రెడ్డికి ఈ అనుభవం ఎదురైంది. పంప్‌హౌజ్‌ సందర్శిస్తున్న సమయంలో జగదీశ్‌రెడ్డి వెళ్తున్న లిఫ్ట్‌ ఆగిపోయింది. దీంతో మంత్రి అందులో ఇరుక్కుపోయారు. దాదాపు గంటపాటు జగదీశ్‌రెడ్డి అందులోనే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత అధికారులు లిఫ్ట్‌ అద్దాలు పగులగొట్టి మంత్రిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం మంత్రి అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.

కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా.. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లక్ష్మాపూర్‌ గ్రామ సమీపంలోని 8వ పంప్‌హౌజ్‌ను మంత్రి జగదీష్‌ రెడ్డి శుక్రవారం ఉదయం ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement