మా ప్రమేయం లేదు: మంత్రి | jagadish reddy review on double bedroom houses scheme | Sakshi
Sakshi News home page

మా ప్రమేయం లేదు: మంత్రి

May 17 2017 7:31 PM | Updated on Sep 29 2018 4:44 PM

మా ప్రమేయం లేదు: మంత్రి - Sakshi

మా ప్రమేయం లేదు: మంత్రి

రెండు పడకల ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో తమ ప్రమేయం ఎంతమాత్రం ఉండదని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

నల్లగొండ: రెండు పడకల ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో తమ ప్రమేయం ఎంతమాత్రం ఉండదని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద ఇండ్ల నిర్మాణం జరగాల్సిన గ్రామాలను మాత్రమే తాము గుర్తిస్తామని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలపై సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అస్సలు ఇల్లు లేని వారితో పాటు పూర్తిగా పూరి గుడిసెల్లోనూ, రేకుల ఇండ్లలో ఉండే వారిని లబ్దిదారులుగా చేస్తే ఎంపిక సులభతరమవుతుందని సూచించారు. ఇండ్ల స్థలాల గుర్తింపులో గ్రామాల నాయకులను, పెద్దలను పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందన్నారు. లబ్దిదారుల ఎంపిక బాధ్యత పూర్తిగా అధికారులదేనన్నారు. దీనిపై ఆర్డీవోలు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ రావుతోపాటు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement