ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య | intermediate student suicide in khammam | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

Nov 13 2015 4:38 PM | Updated on Nov 9 2018 4:36 PM

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో శుక్రవారం చోటుచేసుకుంది.

ఖమ్మం: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక సూర్యతండాకు చెందిన జె.సుమన్ (17)  కృష్ణవేణి జూనియర్ కళాశాల హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. 

శుక్రవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా.. వారు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు కాలేజీకి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement