breaking news
krishnaveni junior college
-
ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
ఖమ్మం జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాల హాస్టల్లో ఉప్పల సంధ్యారాణి(16) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంధ్యారాణి స్వగ్రామం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం మిట్టపల్లి గ్రామం. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు ఖమ్మం బయలుదేరారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఖమ్మం: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక సూర్యతండాకు చెందిన జె.సుమన్ (17) కృష్ణవేణి జూనియర్ కళాశాల హాస్టల్లో ఉంటూ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లగా.. వారు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు కాలేజీకి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.