
హైదరాబాద్: ఆక్వా రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇండియన్ ఫిషరీస్ అండ్ ఆక్వా కల్చర్, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఆక్వా ఎక్స్‌పో–2019 జరగనుంది. ఈ మేరకు గురువారం మత్స్యశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ సుల్తానియా ఎక్స్‌పో బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులనూ, కొనుగోలుదారులనూ, సరఫరా దారులనూ, పరిశ్రమ నిపుణులనూ ఒక గొడుగు కిందకు తీసుకురావడమే ఎక్స్‌పో ఉద్దేశమని పేర్కొన్నారు.
రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎక్స్‌పో జరుగుతుందన్నారు. మత్స్యకారులు ఒక సంఘంగా ఏర్పాటైతే వారికి కావలసిన పరికరాలు అందిస్తామని సుల్తానియా చెప్పారు. కార్యక్రమంలో జాతీయ మత్య్సశాఖ అభివృద్ధి బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణి కుముదిని, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ, సొసైటీ ఫర్ ఇండియన్ ఫిషరీ‹