అక్రమంగా తరలిస్తున్న రేషన్ స్వాధీనం | illegally Trafficking Ration seized | Sakshi
Sakshi News home page

అక్రమంగా తరలిస్తున్న రేషన్ స్వాధీనం

Mar 17 2016 4:49 PM | Updated on Sep 3 2017 7:59 PM

అక్రమంగా తరలిస్తున్న రేషన్ సరుకులను కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండల పోలీసులు గురువారం పట్టుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ సరుకులను కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండల పోలీసులు గురువారం పట్టుకున్నారు. ట్రాలీ ఆటోలో రేషన్ సరుకులను తరలిస్తుండగా రేగుంట గ్రామ సమీపంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆరుగురిని అదుపులోకి తీసుకుని, 200 లీటర్ల కిరోసిన్, 16 క్వింటాళ్ల గోధుమలు, నాలుగు క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ సరుకులను రాయికల్, మల్లాపూర్ మండలాల్లో అక్రమంగా కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు తేలిందని ఎస్సై జానీపాషా తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement