అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టివేత | Illegal liquor bottles seized | Sakshi
Sakshi News home page

అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టివేత

Aug 3 2015 3:35 PM | Updated on Sep 3 2017 6:43 AM

అక్రమంగా కిరాణ దుకాణంలో నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

చెన్నూరు (ఆదిలాబాద్ జిల్లా) : అక్రమంగా కిరాణ దుకాణంలో నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. కిష్టంపేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి కిరాణ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

కాగా, తన కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో కిరాణ దుకాణంపై సోమవారం దాడి చేసి 66 బాటిళ్ల లిక్కర్, 14 బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement