నగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
బంజారాహిల్స్ (హైదరాబాద్): నగరంలో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. బుధవారం ఉదయం జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్ ఈ చౌరస్తాలో పర్యటించి రహదారులు, ట్రాఫిక్‌ను పరిశీలించారు. జూబ్లీహిల్స్ చౌరస్తాలో పెట్రోల్‌బంక్‌ను ఆనుకొని మలుపు వద్ద ఉన్న స్థలాన్ని రోడ్డుకోసం వినియోగించాలని సోమేష్‌కుమార్ ఆదేశించారు.
అయితే, ఈ స్థలం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని అధికారులు చెప్పగా... ముందు ఈ స్థలాన్ని రోడ్డు విస్తరణ కోసం స్వాధీనం చేసుకుని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు ఈ స్థలంలో ఆక్రమణలు తొలగించారు. దీంతో ఇక్కడ ట్రాఫిక్ సజావుగా సాగడానికి మార్గం సుగమం అయింది. ఇప్పటికే ఇక్కడ మెట్రో పనులు జరుగుతుండగా... త్వరలో ఫై్ల ఓవర్ల నిర్మాణం కూడా ప్రారంభం కానుంది.