ఇదేంటి ‘నామా’?

Hyderabad Women Complaint Against Nama Nageswara Rao - Sakshi

నామా నాగేశ్వరరావుపై మహిళ ఫిర్యాదు

మానసికంగా వేధిస్తున్నారని ఆరోపణ

సాక్షి, ఖమ్మం: టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ హైదరాబాద్‌కు చెందిన సుజాత అనే మహిళ ఆరోపించారు. తనపై లేనిపోని విషయాలు గుప్పించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు గురువారం ఖమ్మం అర్బన్‌​ తహశీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనను చంపుతానని బెదిరించడంతో గతంలో జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు. నామినేషన్‌ దాఖలు చేసినప్పుడు ఈ కేసు గురించి అఫిడవిట్‌లో ఆయన పేర్కొనలేదని, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలను తహశీల్దార్‌కు ఆమె సమర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నామా నాగేశ్వరరావు మా ఇంటికి వచ్చి నన్ను కొట్టాడు. చంపుతానని బెదిరించాడు. నగ్న చిత్రాలను బయట పెడతానంటూ బ్లాక్‌మెయిల్‌ చేశార’ని ఆమె వాపోయారు. కాగా, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదుపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. (నగ్న చిత్రాలున్నాయ్‌.. బయటపెడతా..)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top