భార్య అంటే అన్నీ పంచుకోవాలి అనుకున్నాడో ఏమో, భార్య రాయాల్సిన పరీక్షను తాను రాయబోయాడు.
మహబూబ్‌నగర్ జిల్లా: భార్య అంటే అన్నీ పంచుకోవాలి అనుకున్నాడో ఏమో, భార్య రాయాల్సిన పరీక్షను తాను రాయబోయాడు. తీరా అధికారులకు దొరికి పోయిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పరీక్ష హాల్ నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... పాన్‌గల్ మండలం రేమొద్దులు పాఠశాలలో పరంధామయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల టెట్ పరీక్షకు భార్యాభర్తలు ఇద్దరూ దరఖాస్తు చేశారు. ఆదివారం పరీక్షా కేంద్రంలో భార్యకు బదులుగా తాను రాస్తూ డీఈఓకు పట్టుబడ్డాడు. మరి ఏమైందో ఏమో గానీ కాసేపైన తర్వాత పరందామయ్య అక్కడి నుంచి జారుకున్నాడు.