భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య | husband suicide with wife asking about money | Sakshi
Sakshi News home page

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య

Nov 5 2015 3:50 AM | Updated on Sep 3 2017 12:00 PM

సెల్‌ఫోన్ కోసం తీసుకెళ్లిన డబ్బులు ఏమి చేశావని భార్య అడిగినందుకు అడిగినందుకు క్షణికావేశంలో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

మానవపాడు: సెల్‌ఫోన్ కోసం తీసుకెళ్లిన డబ్బులు ఏమి చేశావని భార్య అడిగినందుకు అడిగినందుకు క్షణికావేశంలో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడులో వెలుగులోకి వచ్చింది. చిన్నఅముదాలపాడుకు చెందిన నరసింహ, అతని భార్య జంగాల మహేశ్వరమ్మ రోజువారీ కూలీలు. పనిచేసుకుంటూ కొంత డబ్బు జమ చేసుకున్నారు.

ఆ డబ్బుతో కొత్తసెల్‌ఫోన్ కొనాలని భావించిన నరసింహ.. గత నెల 24న భార్యతో గొడవ పడి ఇంట్లో ఉన్న రూ.6 వేలు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చిన నరసింహను సెల్‌ఫోన్ కొన్నావా.. డబ్బులు ఎక్కడ పెట్టావని భార్య మహేశ్వరమ్మ అడిగింది. క్షణికావేశానికి గురైన నర్సింహ  ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement