భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య | husband suicide with his wife behaviour | Sakshi
Sakshi News home page

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

Dec 15 2014 1:59 AM | Updated on Sep 2 2017 6:10 PM

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య

భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జైపూర్ మండలం..

జైపూర్ : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జైపూర్ మండలంలోని ఖాజీపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొమ్ము పురుషోత్తం యాదవ్(34) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, ఎస్సై సాధీక్ పాషా వివరాల మేరకు...కొమ్ము లస్మయ్య-దేవక్కలకు ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడు పురుషోత్తంకు పదిహేనేళ్లక్రితం సుజాతతో పెళ్లి జరిగింది. వ్యవసాయ పనులు చేసుకుంటు కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

వీరికి కుమారుడు సిద్దు(8) ఉన్నాడు. పంటల్లో సరైన దిగుబడి రాక నష్టం పోయిన పురుషోత్తం రెండేళ్లక్రితం దుబాయ్‌కి వెళ్లడానికి ప్రయత్నాలు చేశాడు. వీసా రాకపోవడంతో ఖాజిపల్లిలో కూలీ పనులు చేస్తున్నాడు. అతడి భార్య సుజాత  మూడునెలలక్రితం పుట్టింటికి వెళ్లింది. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో మద్యానికి బానిసయ్యాడు. తండ్రి లస్మయ్య పలు మర్లు చెప్పినా వినలేదు. శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. కొంత సమయం తర్వాత కుటుంబ సభ్యులు గమినించి 108 ద్వారా మంచిర్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాధీక్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement