కుటుంబ కలహాలతో గృహిణి ఆత్మహత్య | house wife commits suicide | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో గృహిణి ఆత్మహత్య

Feb 24 2015 4:51 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలం గోకారం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది.

వలిగొండ: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలం గోకారం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. గోకారం గ్రామానికి చెందిన కడగంటి మంజుల(30)కి కుటుంబ సభ్యులకు మధ్య మనస్పర్థలు వచ్చాయి.

 

ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకుంది. కాలిన గాయాలతో అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement