తేనెటీగల దాడి.. నేతలు పరుగో పరుగు! | Honey bee attack at state level sport event in Jagtial district | Sakshi
Sakshi News home page

తేనెటీగల దాడి.. నేతలు పరుగో పరుగు!

Jan 20 2017 5:43 PM | Updated on Aug 9 2018 8:13 PM

తేనెటీగల దాడి.. నేతలు పరుగో పరుగు! - Sakshi

తేనెటీగల దాడి.. నేతలు పరుగో పరుగు!

తేనెటీగలు దాడిచేయడంతో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్‌ స్వల్పంగా గాయపడ్డారు.

గొల్లపల్లి: తేనెటీగలు దాడిచేయడంతో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్‌ సహా పలువురు స్వల్పంగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి శివారులోని మామిడితోటలో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలను ప్రారంభించడానికి కొప్పుల ఈశ్వర్, బాల్కసుమన్ వెళ్లగా అకస్మాత్తుగా తేనెటీగలు విజృంభించడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ ఎంపీ, స్థానిక సీఐ శరత్‌, ఎస్‌ఐ ఉపేంద్రచారి సమా పలువురు టీఆర్ఎస్ నాయకులు తేనెటీగల దాడిలో స్వల్పంగా గాయపడ్డారు.

క్రీడాపోటీల వేదిక వద్ద తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేయడంతో రాజకీయ నాయకులు తమ కార్లలోకి పరుగులు పెట్టారు. తేనెటీగలు వెళ్లిపోయి అంతా మామూలు పరిస్థితి ఏర్పడ్డాక గాయపడిన వారు స్థానిక ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. అనంతరం అక్కడే భోజనాలు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement