రాష్ట్రపతి నిలయంలో 'ఎట్‌ హోం' | At Home Program At Bollaram President House  | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి నిలయంలో 'ఎట్‌ హోం'

Dec 26 2017 2:14 PM | Updated on Dec 26 2017 2:14 PM

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మంగళవారం ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమం నిర్వహించనున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మంగళవారం ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌లతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాలుగు రోజులుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోమ్‌ కార్యక్రమం నిర్వహిస్తారు. కాగా, నగరంలో నాలుగు రోజుల పర్యటన అనంతరం 27వ తేదీ ఆయన ఏపీ రాజధాని అమరావతికి బయల్దేరుతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement