జస్టిస్‌ సంజయ్‌ బదిలీపై న్యాయవాదుల నిరసన

High Court Lawyers Protest Over The Transfer Of Justice Sanjay Kumar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ను పంజాబ్-హరియాణా కోర్టుకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళన చేశారు. విధులను బహిష్కరించిన తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు నిరసన తెలిపారు. శనివారం వరుకు రాష్ట్ర్రవాప్తంగా ఉన్న అన్ని కోర్టులను న్యాయవాదులు బహిష్కరించాలని బార్‌ అసోసియేషన్‌ తీర్మానించింది. సంజయ్‌ కుమార్‌ను తక్షణమే తెలంగాణ కోర్టుకు బదిలీ చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. మరొకవైపు హైకోర్టు బిల్డింగ్‌ను తరలించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని హైకోర్టు పరిరక్షణ సమితి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బార్ కౌన్సిల్‌ గేట్‌ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top