గురుకుల ఉద్యోగాల భర్తీకి లైన్‌ క్లియర్‌ | high court green signal to TSPSC Gurukul Teachers 2017 Exams | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట

Aug 2 2017 12:11 PM | Updated on Aug 31 2018 8:34 PM

గురుకుల  ఉద్యోగాల భర్తీకి లైన్‌ క్లియర్‌ - Sakshi

గురుకుల ఉద్యోగాల భర్తీకి లైన్‌ క్లియర్‌

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. టీఎస్‌పీఎస్సీ  గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయ్యింది. గురుకుల ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జీవో 1274పై హైకోర్టు బుధవారం స్టే ఎత్తివేసింది. గురుకుల మహిళా కళాశాలల్లో పోస్టులన్నింటినీ మహిళలతో భర్తీ కోసం ప్రభుత్వం జీవో 1274ను జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ జీవోను నిలిపివేస్తూ గతంలో హైకోర్టు సింగిల్ జడ్జీ స్టే ఇచ్చారు. ఈ  ఉత్తర్వులపై ప్రభుత్వం అప్పీలు చేయడంతో హైకోర్టు ఇవాళ స్టే ఎత్తివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.  దీంతో వాయిదా పడిన తేదీలను టీఎస్‌పీఎస్పీ త్వరలోనే  ప్రకటించనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement