ఇదే సంపూర్ణ తెలంగాణ  సాధించుకున్న రోజు | High court completes allocation of judicial staff for Telangana | Sakshi
Sakshi News home page

ఇదే సంపూర్ణ తెలంగాణ  సాధించుకున్న రోజు

Jan 2 2019 4:04 AM | Updated on Jan 2 2019 4:54 AM

High court completes allocation of judicial staff for Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం నుంచి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకావడంతో ఇదే సంపూర్ణ తెలంగాణ సాధించుకున్న రోజుగా టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుతో సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర ప్రజలు కూడా సంబరపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన స్ఫూర్తితో పార్లమెంట్‌ లోపల, బయట తాము చేసిన పోరాటానికి ఫలితంగా తెలంగాణ హైకోర్టు కల సాకారమైందన్నారు. ప్రజలకు సత్వరం న్యాయం జరిగేలా జిల్లా అనుబంధ కోర్టులు కూడా త్వరలో ఏర్పాటు కానున్నాయని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement