అక్కడ రోడ్డెలా నిర్మిస్తారు..! | High Court about Road Construction near Lower Manair Dam | Sakshi
Sakshi News home page

అక్కడ రోడ్డెలా నిర్మిస్తారు..!

Jun 16 2017 2:07 AM | Updated on Aug 31 2018 8:34 PM

అక్కడ రోడ్డెలా నిర్మిస్తారు..! - Sakshi

అక్కడ రోడ్డెలా నిర్మిస్తారు..!

లోయర్‌ మానేరు డ్యామ్‌ (ఎల్‌ఎండీ)లో రోడ్డు నిర్మాణం చేపట్టడంపై ఉమ్మడి హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది.

లోయర్‌ మానేరు డ్యాంలో రోడ్డు నిర్మాణంపై హైకోర్టు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్‌: లోయర్‌ మానేరు డ్యామ్‌ (ఎల్‌ఎండీ)లో రోడ్డు నిర్మాణం చేపట్టడంపై ఉమ్మడి హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. ఎల్‌ఎండీలో రోడ్డు నిర్మా ణం చేపట్టబోమంటూ గత ఏడాది హైకోర్టు కు ఇచ్చిన హామీకి విరుద్ధంగా రోడ్డు నిర్మా ణానికి టెండర్లు ఎలా ఆహ్వానించారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరా లను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్, జస్టిస్‌ తెల్లప్రోలు రజనీతో కూడిన ధర్మాస నం ఉత్తర్వులిచ్చింది.

ప్రత్యామ్నాయ రోడ్డు ఉండగా, పర్యాటకులను ఆకర్షించే పేరుతో కొందరు రాజకీయ నాయకులకోసం ప్రభు త్వం లోయర్‌ మానేరు డ్యామ్‌లో రోడ్డు నిర్మాణం చేపడుతోందని, ఈ నిర్మాణం చేప ట్టబోమని గతంలో హామీఇచ్చి ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ సామాజిక కార్యకర్త గజ్జెల కాంతం హైకోర్టు లో పిల్‌ వేశారు. దీనిపై ధర్మాసనం గురు వారం మరోసారి విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది నజీర్‌ అహ్మద్‌ఖాన్‌ వాద నలు వినిపిస్తూ.. రూ.60కోట్లతో రోడ్డు నిర్మా ణం నిమిత్తం ప్రభుత్వం జీవో జారీ చేసిం దన్నారు.

గతంలో ఇదే అంశంపై పిల్‌ వేసి నప్పుడు, తాము రోడ్డు నిర్మాణం చేపట్ట బోమని, 5.2 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్‌ నిర్మి స్తామని కోర్టుకు తెలిపారన్నారు. ముంపు ప్రాంతంగా ప్రకటించిన చోట ఇప్పుడు రోడ్డు వేస్తున్నారన్నారు. ప్రత్యామ్నాయ రోడ్డు ఉన్నప్పటికీ, మరో రోడ్డు నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇదంతా చేస్తోందన్నారు. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) జోక్యం చేసుకుంటూ... తాము 5.2 కి.మీ. మేర ఫ్లైవోవర్, మరో రోడ్డు కూడా నిర్మిస్తా మన్నారు. రోడ్డు వేయబోమని గతంలో కోర్టుకు హామీ ఇచ్చి, అందుకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తారని కోర్టు ప్రశ్నిం చింది. గడువిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుం చుతానని ఏజీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement