‘ఇస్మార్ట్ శంకర్’కు చార్మినార్‌ ఎస్సై ఫైన్‌ | Hero Ram Get RS 200 Fined For Smoking In Public Place | Sakshi
Sakshi News home page

‘ఇస్మార్ట్ శంకర్’కు చార్మినార్‌ ఎస్సై ఫైన్‌

Jun 24 2019 6:04 PM | Updated on Jun 24 2019 6:05 PM

Hero Ram Get RS 200 Fined For Smoking In Public Place - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘ధూమపానం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ ఈ ప్రకటన ప్రతి సినిమా ప్రారంభ సమయంలో చూస్తూనే ఉంటాం. బహిరంగ ప్రదేశాలలో సిగరేట్‌ తాగితే జరిమాన విధిస్తారని అందరికి తెలుసు కానీ, చాలా మంది బహిరంగంగానే సిగరేట్లు తాగుతారు. దీనికి హీరో రామ్‌ కూడా అతీతుడిని కాదనిపించుకున్నాడు. బహిరంగంగా సిగరేట్‌ తాగుతూ.. రూ. 200 జరిమానా చెల్లించాడు. ఇస్మార్ట్ శంకర్ షూటింగ్‌లో భాగంగా చార్మినార్‌ వెళ్లిన రామ్‌.. షూటింగ్‌ తర్వాత బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగాడు. ఇది గమనించిన చార్మినార్‌ ఎస్సై పండరీ రామ్‌కు రూ.200 జరిమానా విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement