యాదాద్రి కొండపై ఈదురుగాలుల బీభత్సం! | heavy winds creat ruckus at yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రి కొండపై ఈదురుగాలుల బీభత్సం!

Apr 5 2017 6:03 PM | Updated on Sep 5 2017 8:01 AM

యాదాద్రి కొండపై ఈదురుగాలుల బీభత్సం!

యాదాద్రి కొండపై ఈదురుగాలుల బీభత్సం!

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండపై బుధవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.

యాదాద్రి: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండపై బుధవారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా విరుచుకుపడిన ఈదురుగాలులతో యాదాద్రి కొండపై ఉన్న శాశ్వత పూజల షెడ్డు కుప్పకూలింది.

లడ్డూ కౌంటర్‌ రేకులు గాలిలోకి ఎగిరాయి. దీంతో ఒక భక్తుడు గాయపడ్డాడు. శ్రీరామనవమి పర్వదినం కావడంతో యాదగిరి నరసింహాస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఈదురుగాలులు విరుచుకుపడటంతో భక్తులు ఒక దశలో భయాందోళనకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement