బాసరలో పోటెత్తిన భక్తజనం | Heavy rush at Basara temple | Sakshi
Sakshi News home page

బాసరలో పోటెత్తిన భక్తజనం

Jun 7 2015 9:32 AM | Updated on Aug 17 2018 2:53 PM

తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో ఆదివారం భక్తులు పోటెత్తారు.

ఆదిలాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు పూర్తి కావచ్చిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు సరస్వతీదేవి దర్శనానికి బారులు తీరారు. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement