‘జీవితంలో ఫెయిలయ్యాను..’ | he write a suicide note after he suicide | Sakshi
Sakshi News home page

‘జీవితంలో ఫెయిలయ్యాను..’

Oct 12 2014 1:48 AM | Updated on Nov 6 2018 8:04 PM

‘జీవితంలో ఫెయిలయ్యాను..’ - Sakshi

‘జీవితంలో ఫెయిలయ్యాను..’

సూసైడ్ నోట్ రాసిపెట్టి ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కరీంనగర్ జిల్లావాసి. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది.

సూసైడ్ నోట్ రాసిపెట్టి యువకుడి ఆత్మహత్య
మృతుడు కరీంనగర్ జిల్లావాసి.. శామీర్‌పేట్‌లో ఘటన

 
శామీర్‌పేట్:
సూసైడ్ నోట్ రాసిపెట్టి ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కరీంనగర్ జిల్లావాసి. ఈ సంఘటన శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఎస్‌ఐ మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్  జిల్లా మంచిర్యాలలోని శ్రీరాంపురం నివాసి ఆదిత్యపవన్(23) కొన్నాళ్ల క్రితం స్వస్థలంలో బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చాడు.

నారాయణగూడలోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ ఓ కోచింగ్ సెంటర్‌లో చేరాడు. శుక్రవారం కరీంనగర్ వెళ్తున్నానని అతడు హాస్టల్‌లో చెప్పి బయలుదేరాడు. ఇదిలా ఉండగా శనివారం శామీర్‌పేట్ మండల కేంద్రంలోని శివగంగా బోర్‌వెల్ కార్యాలయం వెనుక అటవీ ప్రాంతంలో ఓ యువకుడు మృతదేహంగా పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

మృతుడి జేబులో ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా అతడు మంచిర్యాలలోని శ్రీరాంపురం నివాసి ఆదిత్యపవన్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి సమీపంలో ఓ పురుగులమందు డబ్బా పడి ఉంది. దీంతో ఆదిత్యపవన్ పరుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు. మృతుడి జేబులో  సూసైడ్ నోట్ లభించింది. ‘నేను జీవితంలో ఫెయిల్ అయ్యాను.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్న’ అని ఆదిత్యపవన్ తన తల్లిదండ్రులకు రాశాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement