సీఎంను కలిసిన హరీశ్వర్ | harishwar reddy meets the cm kcr | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన హరీశ్వర్

Dec 19 2014 12:02 AM | Updated on Mar 28 2018 11:11 AM

సీఎంను కలిసిన హరీశ్వర్ - Sakshi

సీఎంను కలిసిన హరీశ్వర్

అధిష్టానంపై అలక వహించిన టీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్వర్‌రెడ్డి గురువారం..

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధిష్టానంపై అలక వహించిన టీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్వర్‌రెడ్డి గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలుసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని గుర్రుమీద ఉన్న హరీశ్వర్... సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే, నియోజకవర్గానికి నిధులు, కొన్ని పోస్టింగ్‌ల విషయంలో ముఖ్యమంత్రిని కలిశానే తప్ప... నామినేటెడ్ పదవుల ప్రస్తావనేది తమ  మధ్య చర్చకు రాలేదని హరీశ్వర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇదిలావుండగా, రెండు మూడు రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని, టీఐఐసీ లేదా తెలంగాణ ప్రాంతీయ బోర్డు పదవిని ఇస్తానని హరీశ్వర్‌కు సీఎం భరోసా ఇచ్చినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement