దేవరకొండ ఆదర్శంగా నిలుస్తుంది

Harish Rao Talk About Reservoirs In Nalgonda - Sakshi

కొండమల్లేపల్లి(దేవరకొండ) : రానున్న రోజుల్లో రిజర్వాయర్ల నిర్మాణాలతో రాష్ట్రంలోనే దేవరకొండ నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని కొండభీమనపల్లి వద్ద పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న దొంతినేని సంపతమ్మ కల్యాణ మండప నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయితే 1లక్షా 60 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.  ప్రసుతం డిండి ప్రాజెక్టు నుంచి సాగు నీరందిస్తున్నామన్నారు. వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేద పిల్లలకు సహయ సహకారాలు అందించాలని సూ చించారు. ట్రస్ట్‌ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

అనంతరం ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ ఖిల్లా అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరగా  ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయించేలా చూస్తానని çహామీ ఇచ్చారు. అనంతరం నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ బాలూనాయక్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం సకాలంలో వానలు పడకపోవడంతో రైతులు ఇబ్బందులు పడకుండా ఉం డేందుకు గాను కల్వకుర్తి నుంచి నీటిని విడుదల చేయాలన్నారు.  అంతకు ముందు మంత్రి హరీశ్‌రావుకు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఘ నంగా స్వాగతం పలికారు.

కార్యక్రమంలో ఎ మ్మెల్సీ భానుప్రసాద్‌రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, నోముల న ర్సింహ్మయ్య,   రవీందర్‌రావు, ఉజ్జిని యాదగిరి రావు, బాబూ రావు ,శ్రీనివాసరావు, శ్రీకాంత్‌రావు, రవీందర్‌రావు, జగన్మోహన్‌రావు, ప్రభాకర్‌రావు, రామ్మోహన్‌రావు, వెంకటేశ్వరరా వు, నరేం దర్‌రావు, వెంకటేశ్వరరావు, రామేశ్వరరావు, నరేందర్‌రావు, రాంచందర్‌నాయక్, మా ర్కెట్‌ చైర్మన్‌ బాలనర్సింహ, ఎంపీపీ శ్రీని వాస్‌యాదవ్, జెడ్పీటీసీ నర్సింహ, మున్సిపల్‌ చైర్మన్‌ దేవేందర్, జనార్దన్‌రావు, కృష్ణ కిశోర్‌రావు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top