ఆ ఘనత కేసీఆర్‌దే: హరీశ్‌  | Harish Rao Praises KCR On SC ST Reservations In Contracts | Sakshi
Sakshi News home page

ఆ ఘనత కేసీఆర్‌దే: హరీశ్‌ 

May 24 2018 2:52 AM | Updated on Aug 15 2018 9:06 PM

Harish Rao Praises KCR On SC ST Reservations In Contracts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలోనే ఎస్టీ, ఎస్సీలకు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం జలసౌధలో దళిత్‌ ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, ఇండస్ట్రీ(డిక్కీ) ప్రతినిధులతో సమావేశం లో హరీశ్‌ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎస్టీ, ఎస్సీలకు 15%, 6% కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్‌ కల్పించిన ఘనత కేసీఆర్‌దన్నారు. దేశంలోనే తొలి సారిగా ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక హాస్టళ్లు, గురుకుల కళాశాలలు, 50 ఎస్సీ, 25 ఎస్టీ మహిళా డిగ్రీ కళాశాలలను ప్రారంభించామన్నారు. ఆర్‌ అండ్‌ బి, ఇరిగేషన్, పంచాయతీరాజ్‌ శాఖల్లో ఇంజనీరింగ్‌ పనుల్లో దళిత, గిరిజనులకు 15%, 6% వంతున రిజర్వు చేయడం దేశంలోనే తొలిసారని చెప్పారు. నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(న్యాక్‌)లో 300 మంది ఇంజనీరింగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌లో శిక్షణ ఇస్తోందన్నారు. ఈ సందర్భంగా డిక్కీ ప్రతినిధులను హరిశ్‌రావు అభినందించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement