బడి బాట.. కాలి బాటే..!

బడి బాట.. కాలి బాటే..! - Sakshi


- అరకొరగా రవాణా భత్యం

- గతేడాది విద్యార్థులకే అందలేదు

- ఈ ఏడాది ఇంకా ఊసేలేదు

- తెరపైకి వచ్చిన సైకిళ్ల పంపిణీ..!

 

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశిం చిన బడిబాట పథకం అమలులో రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆర్థిక భారం కారణంగా దూరప్రాంతాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు మధ్యలో బడి మానకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి రవాణాభత్యం అందజేస్తోంది. అయితే, ఏటా అరకొర కేటాయింపులు, నామమాత్రపు పంపిణీతో విద్యాశాఖ నెట్టుకోస్తోంది. గతేడాది నిధులు విడుదలై విద్యాసంవత్సరం గడిచినా విద్యార్థులకు రవాణా భత్యం అందలేదు.



అయితే, రవాణా భత్యం సొమ్ముతో సైకిళ్లు కొనుగోలు చేద్దామనే రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారుల ఆలోచనకు ఇంతవరకు క్షేత్ర స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. అంతేకాక రవాణాభత్యం పంపిణీ పారదర్శకంగా జరగడానికి విద్యార్థుల బ్యాంకు ఖాతాలలో నేరుగా భత్యం సొమ్ము వేద్దామనే ఆలోచనకు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల సొమ్ము రాజీవ్ విద్యామిషన్ ఖాతాలో మూలుగుతోంది. దీంతో క్షేత్రస్థాయిలో ని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా ల్లో వందలాది మంది విద్యార్థులకు భత్యం అంద క చదువులు భారంగా సాగుతున్నాయి.



 ఈ ఏడాదైనా మొత్తం ఇచ్చేరా....

 తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రాష్ట్ర  రాజీవ్ విద్యామిషన్ అధికారులు సెప్టెంబర్‌లోనే రూ. 2 కోట్ల వరకు సొమ్ము విడుదల చేశారు. కానీ విద్యాసంవత్సరం పూర్తయినా విద్యార్థులకు ఇప్పటి వరకు భత్యం మాత్రం అందలేదు. నిజామాబాద్ జిల్లాలో గతేడాది 480 విద్యార్థులకు రూ.10.01 లక్షల సొమ్ము రావాలి. అలాగే 2012-13 సంవత్సరంలో 143 మందికి,  2013-14 , 2014 సంవత్సరానికి 191 మందికి ఒక్కొక్కరికి రూ.300 చొప్పున 10 నెలల భత్యం అందింది. జిల్లాలో మారుమూల గ్రామాల్లో అర్హులైన విద్యార్థులకు అందలేదు. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది 213 పాఠశాలలకు చెందిన 2,672 మంది విద్యార్థులకు అందాల్సి ఉంది. జిల్లాకు రూ.80 లక్షలు విడుదలైనా రాజీవ్‌విద్యామిషన్ ఖాతాలో మూలుగుతున్నాయి.   2013-14కు సంబంధించి ఈ జిల్లాలో నిధులు విడుదల చేయలేదు. కరీంనగర్ జిల్లాలో 723 మంది విద్యార్థులకు గత విద్యాసంవత్సర భత్యం అందించాల్సి ఉంది.  దీనికిగాను జిల్లాకు రూ. 21.69 లక్షలు విడుదలయ్యాయి. కానీ, ఇంత వరకు విద్యార్థుల ఖాతాలలోకి చేరలేదు.



 సైకిళ్ల పంపిణీ పేరుతో జరుగుతున్న జాప్యం

 ఉన్నత తరగతుల విద్యార్థులకు ప్రయాణ భత్యం కింద వచ్చే నిధులతో సైకిళ్లను అందించాలని ఐదు నెలల క్రితం రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ అధికారులు నిర్ణయించారు. కానీ వాటికి ఇంతవరకు అతీగతీలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top