గురుకులంలో దారుణం.. ప్రిన్సిపాల్‌ భర్త అసభ్య ప్రవర్తన! | Gurukulam Student Harassed By Gurukulam School Principals Husband | Sakshi
Sakshi News home page

May 7 2018 3:33 PM | Updated on May 7 2018 5:15 PM

Gurukulam Student Harassed By Gurukulam School Principals Husband - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో కామాంధుడు. నగరంలోని శేర్‌లింగంపల్లి గోపంపల్లిలోని గురుకుల పాఠశాలలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ భర్త తొమ్మిదో తరగతి విద్యార్థిని పట్ల నీచంగా ప్రవర్తించాడని ఈ నెల 3న గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సెక్షన్‌ 354 ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపంపల్లిలోని గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై పాఠశాల ప్రిన్సిపాల్‌ ప్రమోదీని భర్త నాగేశ్వర్‌ రావు అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో బాలిక తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గురుకుల పాఠశాల ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్‌ ప్రమోదీని సస్సెండ్‌ చేశారు. అయితే ఈ నీచానికి పాల్పడిన నాగేశ్వర్‌ రావు పరారీలో ఉన్నట్లు పోలీసు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement