‘న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు’ | gudur madhukar reddy father-in-law comments | Sakshi
Sakshi News home page

‘న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు’

Apr 14 2017 1:45 PM | Updated on Aug 11 2018 7:56 PM

‘న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు’ - Sakshi

‘న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు’

మనస్తాపం చెంది తన కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసిందని స్వాతి తండ్రి ఆరోపించారు.

హైదరాబాద్‌: మధుకర్‌ కుటుంబ సభ్యులు లేనిపోని ఆరోపణలు చేయడంతో మనస్తాపం చెంది తన కుమార్తె ఆత్మహత్యాయత్నం చేసిందని స్వాతి తండ్రి ఆరోపించారు. మధుకర్‌ కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని చెప్పారు. తమపై దాడి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని అన్నారు. 

మధుకర్‌రెడ్డి మరణానికి స్వాతి కారణమని ఆరోపిస్తూ అతడి కుటుంబసభ్యులు రెండు రోజుల క్రితం స్వాతి, ఆమె తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డారు. కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న గూడూరు మధుకర్‌రెడ్డి ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్నాడు. స్వాతి వేధింపుల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని మధుకర్‌రెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

అయితే మానసిక కుంగుబాటుతోనే మధుకర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడని, తనవల్ల కాదని స్వాతి తెలిపింది. తనపై అత్తింటివారు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న ఆవేదనతో కొత్తపేట సౌభాగ్య పురంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటున్న స్వాతి గురువారం అర్ధరాత్రి ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement