
సాక్షి, హైదరాబాద్: వేరుశనగ గింజల నుంచి నూనె తీసే యంత్రాలు ఇస్తామని నమ్మించి వేలాది మంది నుంచి కోట్ల రూపాయాలు వసూలు చేసిన గ్రీన్‌గోల్డ్ బయోటెక్ సంస్థ ఎండీ శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా కాంత్‌పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.లక్ష రూపాయలు చెల్లిస్తే పల్లీల నుంచి నూనే తీసే యంత్రం ఇస్తామని దాంతో నెలకు పదివేలు సంపాదించవచ్చని ఆశ చూశారు. ఏజెంట్ల ద్వారా వీటికి ప్రచారం కల్పించి వేలాది మందిని మోసం చేశారు. ఈ మోసంపై ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు వెలుగులోకి వచ్చింది. తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కూడా మోసాలకు పాల్పడినట్లు సమాచారం. ఈ స్కాంలో దాదాపు ఆరు వేలకు పైగా బాధితులు ఉన్నట్లు సమాచారం.