'హైదరాబాద్ను విశ్వనగరం ఎలా చేస్తారు' | Government trying to escape ration cards, says bjp mla lakshman | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్ను విశ్వనగరం ఎలా చేస్తారు'

Nov 13 2014 1:24 PM | Updated on Mar 29 2019 8:30 PM

'హైదరాబాద్ను విశ్వనగరం ఎలా చేస్తారు' - Sakshi

'హైదరాబాద్ను విశ్వనగరం ఎలా చేస్తారు'

రేషన్ కార్డుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్ ఆరోపించారు. సమగ్ర సర్వే ...

హైదరాబాద్ : రేషన్ కార్డుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్ ఆరోపించారు. సమగ్ర సర్వే నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం మళ్లీ రేషన్ కార్డుల కోసం ఎందుకు దరఖాస్తు చేసుకోమనడం సమంజమా అని ఆయన ప్రశ్నించారు. రేషన్ కార్డులపై సభలో నిలదీస్తే ప్రభుత్వం ఎందుకు తప్పించుకోవాలనుకుంటోందని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ పేద వర్గాల రేషన్ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించామన్నారు.

సంక్షేమ పథకాలకే సమగ్ర సర్వే అని రేషన్ కార్డులు తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎలుకల కోసం ఇల్లు తగులపెట్టినట్లుగా ఎక్కడో బోగస్ కార్డులున్నాయని అందరినీ దరఖాస్తు చేసుకోమనడం సమంజసమా అని అన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తామని గతంలో ఉన్న రీయింబర్స్మెంట్ తొలగించారని, అనారోగ్యంతో ఉద్యోగులు ఆస్పత్రులకు వెళ్తే రీయింబర్స్మెంట్ రాకపోవటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షాల కారణంగా రోడ్లు జలమయం అవుతుంటే హైదరాబాద్ను విశ్వ నగరంగా ఎలా తీర్చిదిద్దుతారని లక్ష్మణ్ ఈ సందర్భంగా ప్రభుత్వంపై  ప్రశ్నలు సంధించారు. చిన్నపాటి వర్షానికే నగరం జలమయం అవుతోందని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement