కనికరం లేని సర్కారిది

Government Delayed Mondora Victims - Sakshi

మెండోరా బాధితులకు‘ఆపద్బంధు’తో సరిపెట్టారు

ఇంతవరకూ అందని ఎక్స్‌గ్రేషియా

నల్లగొండలో జరిగిన ప్రమాద  బాధితులకు అందిన పరిహారం  

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న  బాధిత కుటుంబాలు

అది ఘోరమైన ప్రమాదం.. ఆటోలో ప్రయాణిస్తున్న ముక్కుపచ్చలారని చిన్నారులతో సహా 11మందిని బావి మింగేసింది. బాధిత కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఏమిచ్చిన వారి బాధను తగ్గించలేని పరిస్థితి. ప్రభుత్వం కూడా వారికి కొద్దిపాటి సాయం చేసి చేతులు దులుపుకుంది.

మోర్తాడ్‌(బాల్కొండ):  మెండోరా శివారులోని వ్యవసాయ బావిలోకి ఆటో దూసుకెళ్లిన సంఘటనలో మరణించిన వారి కు టుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంలో ప్రభు త్వం మొండిచేయి చూపిస్తోంది. బావిలోకి ఆటో దూ సుకెళ్లిన సంఘటన పక్షం రోజుల కింద చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనతో పలు కుటుంబాల్లో విషాదం నిండింది. అయితే ఇదే తరహాలో నల్లగొండ జిల్లాలో ఒ క ట్రాక్టర్‌ కాలువలో పడిపోగా తొమ్మిది మరణించా రు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మెండోరా దుర్ఘటనకు, నల్గొండలో చోటు చేసుకున్న సంఘటనకు పోలికలు లేకపోయినా పరిహారం విషయంలో మాత్రం ఎంతో తేడా ఉంది. 

మెండోరా సంఘటనలో..
మెండోర దుర్ఘటనలో 11 మంది మరణించగా అం దులో ఐదుగురు పెద్దవారు కాగా ఆరుగురు పసివాళ్లున్నారు. ఐదుగురు పెద్దవారి కుటుంబ సభ్యులకు జిల్లా అధికార యంత్రాంగం రూ.50వేల చొప్పున ఆపద్బందు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించింది. నల్గొండలో ట్రాక్టర్‌ నీట మునిగి మరణించిన వారి కుటుంబాలకు మాత్రం ప్రభుత్వం రూ.2లక్షల చొప్పున పరిహారం అందించడం గమనార్హం. ఒకే విధమైన సంఘటన వేరు వేరు జిల్లాల్లో చోటు చేసుకోగా పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం తేడాలు చూపడంపై బాధిత కుటుంబాలు కుమిలిపోతున్నాయి. ఇది ఇలా ఉండగా మెండోరా ఘటనలో చిట్టాపూర్‌కు చెందిన రోజా అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా మరణించింది. అలాగే ఇదే సంఘటనలో తన బావ కూతురిని కూడా కోల్పోయింది. అయితే రోజా భర్తకు కేవలం రూ.50వేల ఆపద్బందు పథకం చెక్కును మాత్రమే అందించారు. సాధారణంగా పెద్ద పెద్ద ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణిస్తే ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను ప్రకటిస్తుంది. 

ప్రజాప్రతినిధులూ స్పందించలేదు..
మన జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనపై ప్రభు త్వం స్పందించకపోగా ప్రజాప్రతినిధులు కూడా బా ధిత కుటుంబాల వైపు నిలిచి ప్రభుత్వం నుంచి పరిహారం అందించలేక పోయారు. ఆపద్బందుతోనే చే తులు దులుపుకోవడంపై సర్వాత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆటో బావిలోకి దూసుకెళ్లిన ఘటన లో మరణించిన వారంతో పేద, మధ్య తరగతి కు టుంబాలకు చెందినవారే ఉన్నారు. 

ఆపద్బంధు రెగ్యులర్‌ పథకమే..
ఆపద్బంధు పథకం కింద మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున ఆర్థిక సహాయంను మంజూరు చేయడం సాధారణ విషయం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బీమా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా కొంత సొమ్మును ప్రీమియంగా చెల్లిస్తుంది. ప్రభుత్వం స్పందించి మెండోరా ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవడానికి నిధులు కేటాయించాలని బంధువులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top