మత్తుమందు ఇచ్చి గోల్డ్ వర్క్ షాపును దోచేశాడు... | gold chain theft by giving Morphine | Sakshi
Sakshi News home page

మత్తుమందు ఇచ్చి గోల్డ్ వర్క్ షాపును దోచేశాడు...

Apr 3 2015 9:24 PM | Updated on Sep 2 2017 11:48 PM

నగల దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి ఆ దుకాణం యాజమానికి మత్తుమందు దిచ్చి దోచుకుపోయాడు.

సిద్దిపేట రూరల్(మెదక్): నగల దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి ఆ దుకాణం యాజమానికి మత్తుమందు దిచ్చి దోచుకుపోయాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా సిద్దిపేటలోని పటేల్‌పురాలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు...సిద్దిపేట మండలంలోని పొన్నాల గ్రామానికి చెందిన ఉప్పల వీర బ్రహ్మాచారి పట్టణంలోని పటేల్ పురాలో గోల్డ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గ్రామం నుంచి షాపుకు వచ్చాడు. బ్రహ్మాచారి షాపులో ఉండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి ఉంగరం చేయాలంటూ మాటలు కలిపాడు. నమ్మకంగా దగ్గరికి వచ్చి అతని ముక్కు వద్ద కర్చీఫ్ వాసన చూపాడు. మత్తు ఆవరించటంతో వీరబ్రహ్మాచారి స్పృహ కోల్పోయాడు.

 

ఈ క్రమంలో ఆగంతకుడు అక్కడున్న ఐదు తులాల బంగారు నగలు తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత పక్క దుకాణం యజమానులు వచ్చి బ్రహ్మాచారిని నిద్ర లేపారు. జరిగిన విషయంపై బాధితుడు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్‌ఐ వరప్రసాద్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement