అదృష్టంగా భావిస్తున్నాం: ఈటల | Godavari pushkaralu 2015 conducting very lucky, says Etela Rajender | Sakshi
Sakshi News home page

అదృష్టంగా భావిస్తున్నాం: ఈటల

Jul 25 2015 2:15 PM | Updated on Oct 9 2018 5:58 PM

అదృష్టంగా భావిస్తున్నాం: ఈటల - Sakshi

అదృష్టంగా భావిస్తున్నాం: ఈటల

గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ శనివారం హైదరాబాద్లో తెలిపారు.

కరీంనగర్: గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ శనివారం హైదరాబాద్లో తెలిపారు. గతంలో తెలంగాణలో పుష్కరాలు వివక్షకు గురయ్యాయన్నారు. స్వరాష్ట్రంలో పుష్కరాలను గొప్పగా నిర్వహించుకున్నామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల్లో ఆరు కోట్ల మంది భక్తులకు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా కొన్ని అపశ్రుతులు దొర్లినా భక్తులు ఇబ్బంది పడకుండా చూశామన్నారు.

పుష్కరాల్లో విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులకు పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. పుష్కరాలను గుణపాఠంగా భావిస్తూ వచ్చే మేడారం జాతర, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలు, పద్దతులకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి విజయవంతం చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పని చేస్తోందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement