
భారత్ వైపు ప్రపంచ దేశాల చూపు: కవిత
శాస్త్ర సాంకేతిక రంగంలో అతి తక్కువ వ్యయంతో అద్భుతాలు సృష్టిస్తున్న భారత్ వైపు ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.
హైదరాబాద్: శాస్త్ర సాంకేతిక రంగంలో అతి తక్కువ వ్యయంతో అద్భుతాలు సృష్టిస్తున్న భారత్ వైపు ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఆదివారం ‘స్ట్రీట్ కాజ్’ ఆధ్వర్యంలో నిర్వహించిన హైద్రాబాద్ యూత్ అసెంబ్లీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలను నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తద్వారా రాష్ట్రంలో పచ్చదనానికి, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే వైద్యసేవలకు తక్కువ ఖర్చు అవుతుందన్నారు. వైద్యులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పని చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అలా పనిచేసే వైద్యులకు ప్రభుత్వం అదనపు వేతనం ఇస్తుందన్నారు.